విభిన్నమైన కథలను ఎంచుకుంటే సక్సెస్ బాటలో దూసుకెళ్తున్నారు యువ హీరో సుధీర్ బాబు. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటివలే విడులైన సమ్మెహనం సినిమాతో మరో విజయన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. లవ్ అండ్ ఎంటటైనర్ తో తెరకెక్కిన ఈసినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.
నన్నుదోచుకుందువటే సినిమాతో సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తునాడు. ఈసినిమాలో సుధీర్ బాబుకు జోడిగా నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమూవీతో ఆర్.ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రొమాంటిక్ ఎంటటైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఆర్.ఎస్ నాయుడు. ఇటివలే వచ్చిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
యూత్ ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈసినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. తాజాగా ఈసినిమా విడుదలకు సంబంధించిన విషయాలను ప్రకటించారు చిత్రయూనిట్. వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 13వ తేదిన ఈమూవీని విడుదల చేయనున్నారు. విడుదలకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. సుధీర్ బాబు తన సొంత బ్యానర్లో ఈసినిమాను నిర్మిస్తున్నాడు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు ప్రోడ్యూసర్ గా ఏమేరకు సక్సెస్ సాధిస్తాడో చూడాలి.