స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తిత్లి తుఫాన్ బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ఆయన ఈనిర్ణయం తీసుకున్నారు. తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. గతంలో రూ.25లక్షల సాయం అందించిన బన్నీ ఇప్పుడు మరో సారి సాయం చేసేందుకు రంగంలోకి దిగాడు. తుఫాను బాధితులకు మంచీనిరు సరాఫరా చేయనున్నాడు బన్నీ.
తాజాగా మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లు, ఒక బోర్ వెల్ వేయించేందుకు సిద్దమయ్యాడు. బన్నీ చేసిన సాయం వల్ల శ్రీకాకుళం జిల్లాలోని మందస, వజ్రపుకొత్తూరు మండల్లాలోని దేవునలదడ, పొల్లాడి, అమలపాడు, కొండలోగం గ్రామాలకు సురక్షిత మంచినీరు అందనుంది. గత కొంత కాలంగా అక్కడి ప్రజలు కిడ్ని సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కావున అక్కడ నీటి పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటర్ ప్లాంట్స్ , బోర్ వెల్స్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు అల్లు అర్జున్ సన్నిహితులు.