443కి డిక్లేర్ చేసిన కోహ్లీ సేన‌..

79
kohli test match

మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాపై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులను 7 వికెట్ల నష్టానికి 443 పరుగుల వ‌ద్ద భారత్ డిక్లేర్ ఇచ్చేసింది. రోహిత్ శ‌ర్మ 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్ లో హనుమ విహారి 8, మయాంక్ అగర్వాల్ 76, పుజారా 106, కోహ్లీ 82, రహానే 34, రిషబ్ పంత్ 39, రవీంద్ర జడేజా 4 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 63 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

india test mach

ఆసీస్ బౌలర్లలో కుమిన్స్ కు 3 వికెట్లు దక్కగా, స్ట్రార్క్ 2, లియాన్ ఒక వికెట్ ను త‌మ ఖాతాలో వేసుకున్నారు. రెండ‌వ రోజు ఆట జ‌రిగిన ఆట‌లో పూజారా 281 బంతుల్లో 100 ప‌రుగులు పూర్తి చేసి అవుట్ అయ్యాడు. ప్ర‌స్తుతం ఆసీన్ బ్యాటింగ్ ఆడుతుంది. ఆరోన్ ఫించ్, మార్క‌స్ హారిస్ ఓపెనింగ్ లో వ‌చ్చారు.