మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ పై మూవీని నిర్మిస్తున్నారు. నయనతార కథనాయికగా నటిస్తోన్న ఈసినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.
వచ్చే వేసవిలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఈసినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సైరా సినిమాలో బన్ని కూడా భాగంకానున్నాడని తెలుస్తుంది. అసలు విషయం ఏంటంటే ఈసినిమాలో బన్నీ కనిపించడం లేదు కానీ ఆయన వాయిస్ ను మాత్రం వినిపించనుంది.
బన్నీని కూడా ఈమూవీలో భాగం చేస్తే ఇంకా ఎక్కువ క్రేజ్ వస్తుందని భావించాడట దర్శకుడు సరేందర్ రెడ్డి. ఈ విషయాన్ని ఆయన మెగాస్టార్ చిరంజీవి చెప్పడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సినిమా మొదట వాయిస్ ఓవర్ తో ప్రారంభంకానుండటంతో బన్నీతో వాయిస్ చేయించనున్నారు చిత్రయూనిట్.