పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటనలో ముగ్గురు ప్రభుత్వ టీచర్లపై వేటు వేసింది విద్యాశాఖ. తెలుగు పేపర్ లీకేజీ ఘటనలో ఇద్దరు టీచర్లు, హిందీ పేపర్ లీకేజీ ఘనటలో ఒక టీచర్‌ని సర్వీస్‌ల నుండి తొలగించారు.తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో నిందితులుగా ఉన్న ఎస్.బందెప్ప, సమ్మప్ప, హిందీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో బాధ్యులుగా రూం ఇన్విజిలేటర్ సబియా మదావత్ ను సర్వీస్ నుంచి విద్యా శాఖ తొలగించింది.
ఇక అలాగే పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఎం.శివప్రసాద్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ టి.శ్రీధర్‌ను కూడా సస్పెండ్ చేశారు. స్టూడెంట్ శివకుమార్‌ను కూడా ఐదేండ్ల పాటు డిబార్ చేశారు. ఎంఈవో వెంకటయ్య గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం వారిని రిమాండ్‌కు తరలించారు. జవాబులను మైక్రో జిరాక్స్ చేసిన విద్యా బుక్ సెంటర్ నిర్వాహకుడు శివ పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..