ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో 10 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ క్రస్ట్ గేట్లు ఒకే సంవత్సరంలో ఎత్తడం ఇది ఏడవసారి.
ఇన్ ఫ్లో :5,లక్ష ల 09,868 క్యూసెక్కులు..అవుట్ ప్లో : 3,లక్ష 98 వేల 848 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం : 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు, ప్రస్తుతం నీటిమట్టం :885.00 అడుగులు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రవాహం ఇంకా కొనసాగుతూ ఉండటం తో నీటి పారుదల శాఖ అధికారులు గరిష్ట స్థాయి నీటి ప్రవాహం పెరుగుతూ ఉండడంతో 10 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయుటకు శ్రీశైలం డ్యాం నీటి పారుదల ఎస్సి చంద్రశేఖర్ నిర్ణయం తీసుకోగా ఒక ట్రస్ట్ గేట్ ను 10 అడుగుల మేర ఎత్తి 27 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.