నితిన్-రాశీఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కల్యాణం. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నాడు. దిల్ రాజు-సతీష్ వేగేశ్న కాంబినేషన్‌లో వచ్చిన శతమానం భవతి బిగ్గెస్ట్ హిట్‌గా నిలవగా మరోసారి కుటుంబకథ కాన్సెప్ట్‌తో ఏ మేరకు మెప్పించారో చూద్దాం…?
కథ:
సంప్రదాయాలకు పెద్దపీట వేసే కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు శ్రీనివాస్(నితిన్). డబ్బే పరమావధిగా భావించే ఆర్‌కే(ప్రకాష్ రాజ్) కుమార్తె శ్రీదేవి(రాశీ ఖన్నా)ని చూసి ఇష్టపడతాడు. సీన్ కట్ చేస్తే వీరిద్దరు ప్రేమలో పడతారు. తన పెళ్లిని వేడుకలా చేసుకోవాలని భావిస్తాడు. కానీ ప్రకాష్ రాజ్‌కు నితిన్ వాళ్ల సంప్రదాయాలను పట్టించుకోడు..?అసలు శ్రీనివాస కల్యాణం ఎలా
జరిగింది..?నితిన్ అనుకున్నట్టే సంప్రదాయ పద్దతిలో పెళ్లిచేసుకున్నాడా లేదా అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నటీనటులు,పెళ్లి కాన్సెప్ట్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలు. రాముడు మంచి బాలుడిగా నితిన్ అద్భుత నటనను కనబర్చాడు. రాశీఖన్నా గ్లామర్ సినిమాకు మరింత అందాన్ని తెచ్చింది. ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో మెప్పించాడు. మిగితా నటీనటుల్లో జయసుధ,రాజేంద్రప్రసాద్,నరేష్,సత్యం రాజేష్ తమ పాత్రలకు వందశాతం
న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ క్లైమాక్స్,భావోద్వేగాలు. కుటుంబ కథా చిత్రాల్లో ఎమోషన్ సీన్స్ కీలకం. కానీ అలాంటి సన్నివేశాలు సినిమాలో కనిపించవు. చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం, హీరో పాత్ర,కొన్ని చోట్ల కేవలం డైలాగ్స్ కోసమే సన్నివేశాలు రాసుకోవడం మైనస్.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. కల్యాణం.. వైభోగం సినిమాకే హైలైట్. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సతీశ్ వేగేశ్న ఎంచుకున్న కథ బెటరే కానీ దానికి తగ్గట్టుగా సన్నివేశాలను మలచడంలో కాస్త తడబడ్డాడు. ఎడిటింగ్ పర్వాలేదు. దిల్ రాజు నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
పెళ్లి ,కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కల్యాణం. కథ,నటీనటులు సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా పదే పదే చెప్పిన డైలాగ్‌లే చెప్పడం సినిమాకు మైనస్ పాయింట్స్ . పెళ్లిని, బంధువుల మధ్య అనుబంధాలను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ శ్రీనివాస కల్యాణం.
విడుదల తేదీ:09/08/2018
రేటింగ్:2.75/5
నటీనటులు: నితిన్, రాశీఖన్నా, నందితా శ్వేత
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాత: దిల్‌రాజు, శిరీష్
దర్శకత్వం: సతీష్ వేగేశ్న