భారీ బడ్జెట్ మూవీలో జాన్వీ కపూర్‌..

292
Janhvi kapoor
- Advertisement -

ఇటీవల ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది జాన్వీ. నటన పరంగాను, గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. దాంతో జాన్వీ కపూర్ ను వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ భారీ చారిత్రక చిత్రంలో నటించే ఛాన్స్ ఆమెకి దక్కింది. ఆ సినిమా టైటిల్‌ ‘తక్త్’. ఈ పేరుకి ‘సింహాసనం’ అనే అర్థం వుంది. అందువలన ఇది సింహాసనం కోసం కొనసాగే పోరాట చిత్రంగా ఉంటుందని అనుకోవచ్చు. 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించనున్నాడు.

Janhvi kapoor

ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన సరసన కరీనా కపూర్ .. అలియా భట్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇదే చిత్రంలో రణవీర్ సోదరుడు ఎనర్జిటిక్ బోయ్ విక్కీ కౌశల్ ఓ హీరో. బహుశా జాన్వీ అతడికి పెయిర్‌గా కనిపించనుందని సమాచారం. ఇలాంటి క్రేజీ వారియర్ హిస్టారికల్ సినిమాలో కపూర్ గాళ్ జాన్వీకి ఛాన్స్ అంటే రొట్టె విరిగి నెయ్యిలో పడ్డట్టే మరి.

- Advertisement -