- Advertisement -
మహబూబ్ నగర్‌లో పర్యటించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ లో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు పెద్ద చెరువు క్రింద జలమాయమైన రామయ్యబౌలి ప్రాంతంలో పర్యటించారు.
నాలలపైన అనధికార కట్టడాలను తొలగించి, భారీ వర్షాలకు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి శ్రీనివాస్.
ఈ సందర్భంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 4 వ వార్డ్ ఎదిర, హౌసింగ్ బోర్డ్ కాలనీల నుండి ఎం.సత్యం ముదిరాజ్, బి.బానుచందర్, పి.అమర్నాథ్ రెడ్డి, జి.ఎస్.రాజు మరియు 200 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.
- Advertisement -