తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం: మంత్రి కేటీఆర్

195
ktr
- Advertisement -

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ కి సాదర స్వాగతం పలుకుతామని, అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ తయారీకోసం ప్రత్యేక పార్కును ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో జరుగుతున్న సాగునీటి, రోడ్డు ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కుల వంటి నిర్మాణం వలన కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ కు అనేక అవకాశాలున్నారు.

కోవిడ్ వలన అందరికి, అన్ని రంగాలపై కొంత ప్రభావం పడిందన్న మంత్రి కెటియార్, తెలంగాణలో అర్ధిక వ్యస్దను గాడిలోపెట్టే ప్రయత్నం తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నదని తెలిపారు. తెలంగాణలో ఆది నుంచి సంక్షేమం, అభివృద్ది జంట ప్రాధాన్యతలుగా పాలన కోనసాగుతున్నదన్నారు. దేశంలో వలస కార్మికులను అతిధి కార్మికులుగా పెర్కొన్నది తామే అన్నారు. వారికోసం సంక్షోభ సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, వాటిలో వేలాది మంది లాక్ డౌన్ తర్వతా పనుల్లో యథావిధిగా పాల్గోంటున్నారని, దీంతో భవన నిర్మాణ రంగం తిరిగి పుంజుకుంటుదన్నారు.

కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ పరిశ్రమకున్న సవాళ్లు, అవకాశాలపైన ప్రభుత్వానికి నివేధిక ఇవ్వాలని కోరారు.ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టియస్ ఐపాస్ వంటి పాలసీల్లో పరిశ్రమ వర్గాల ఫీడ్ భ్యాక్ ఉన్నదన్నారు. కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ నిర్వహించే ఎక్స్ కాన్ వంటి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అతిధ్యం ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వలన దీర్ఘకాలంలోనూ కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ పరిశ్రమకు డిమాండ్ ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, తెలంగాణలో ఉన్న మైనింగ్ అవకాశాలు, హైదరాబాద్ నగరంలో చేపడుతున్న రోడ్డు, భవన నిర్మాణాల వలన కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ పరిశ్రమకు అవకాశాలున్నాయన్నారు.

తెలంగాణలో అవసరం అయితే పరిశ్రమ కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ సదుపాయాన్ని కల్పిస్తామని మంత్రి పరిశ్రమ ప్రతినిధులకు హమీ ఇచ్చారు.కేంద్రం చేప్తున్న ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధన్యత ఇవ్వాలన్నారు. దేశం అగ్రదేశాల సరసన చేరాలంటే భారీ ఎత్తున దేశంలో హైస్పీడ్ నెట్ వర్క్ నిర్మాణం, నూతన ఎయిర్ పోర్టులు, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పారిశ్రామిక వాడల వంటి మౌళిక వసతుల కల్పన జరగాల్సి ఉన్నదని, ఇందులో కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ పరిశ్రమ కీలక పాత్ర పోషించాలన్నారు. ఇందుకోసం అవసరం అయన పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకోవాలని, రాష్ట్రం పరిధిలో ఇలాంటి నిర్ణయాలు కావాలంటే తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మౌళిక వసతుల ప్రాజెక్టులను ప్రత్యేకంగా కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ అసోషియేషన్ అభినందించింది. దేశంలోనే ఇతర రాష్ర్టాలకు మౌళిక వసతులు కల్పనలో తెలంగాణ అదర్శంగా నిలుస్తుందన్న కన్ స్ట్రక్షన్ ఏక్విప్ మెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ అసోషియేషన్ పెర్కోన్నది.

- Advertisement -