భారీగా పెరిగిన కూరగాయల ధరలు..

219
vegitables price
- Advertisement -

కూరగాయల ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. టమోటా దగ్గరి నుండి బెండకాయ,బీన్స్,వంకాయ,పొటాటో ఇలా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి.

కొన్ని రోజుల కిందట కేజీ టమోటా ధర రూ.10 నుంచి రూ.15 వరకు ఉండగా ప్రస్తుతం టమోటా ధర కేజీకి ఏకంగా రూ.70 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. వర్షాల కారణంగా టమోటా పంట దిగుబడి సడన్‌గా పడిపోయింది. దీంతో టమోట ధర పెరిగిపోయింది.

బెండకాయ ధర ఇప్పుడు మార్కెట్‌లో కేజీకి రూ.30 నుంచి రూ.40 వరకు ఉంది. అలాగే క్యాప్సికమ్, బీన్స్ ధర కూడా కేజీకి రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. కాలీఫ్లవర్ ధర కేజీకి రూ.40 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. వంకాయ ధర కూడా కేజీకి రూ.30 వరకు ఉంది. కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు షాక్‌కు గురవతున్నారు.

- Advertisement -