ఆబ్కారి శాఖ అధికారులతో మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ స‌మీక్ష‌..

156
minister srinivas goud
- Advertisement -

హైదరాబాద్‌ గోషామహల్ నియోజకవర్గంలో గుడుంబా బాదితులకు పునరావస కల్పనపై రాష్ర్ట ఆబ్కారిశాఖ మంత్రి వి. శ్రీ‌నివాస్‌గౌడ్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ మరియు ఆబ్కారి శాఖ ఉన్నతాధికారులతో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుడుంబా నిర్ములనలో భాగంగా లబ్ధిదారులకు పునరావాస పథకంలో భాగంగా దూల్‌పేట‌లో 505 మంది లబ్ధిదారులకు, హైదరాబాద్ జిల్లాలో 795 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల విలువైన యూనిట్ లను మొత్తం రూ. 16 కోట్లు ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు అందించిన‌ట్లు తెలిపారు.

పునరావాస పథకంలో భాగంగా నూత‌న లబ్ధిదారులకు ఎన్జీవో, ప్రభుత్వ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పథకాలను, స్కిల్ డెవలప్ కోర్సుల్లో శిక్షణ అందివ్వడం వల్ల వారి జీవితాలలో వెలుగులు అందించవచ్చ‌ని అధికారులకు సూచించారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో జరిగే కురుమూర్తి జాతరపై స్థానిక ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర్ రెడ్డితో కలసి జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.

- Advertisement -