కలం యోధుడు…దాశరథి: మంత్రులు ఎర్రబెల్లి,శ్రీనివాస్ గౌడ్

222
errabelli
- Advertisement -

నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని వెలుగెత్తిచాటిన మహాకవి, కలం యోధుడు దాశరథి రంగమాచార్య అని కొనియాడారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్‌. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన రచనలతో తెలంగాణ అస్థిత్వపు భావజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు, మహాకవి దాశరథి అని ఘనంగా నివాళులు అర్పించారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో దాశరథి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించిన శ్రీనివాస్ గౌడ్… తరతరాల బూజు మా నిజాం అని.. మహాకవి దాశరథి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాకవి అని కొనియాడారు.దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహించటానికి ఆదేశాలు ఇవ్వడమే కాక, ప్రతి సంవత్సరం ప్రముఖ కవులకు సత్కారం, పురస్కారాలను అందిస్తున్నారన్నారు. 2020 సంవత్సరపు దాశరథి పురస్కారాన్ని డా. తిరునగరి రామనుజయ్య ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

జైల్లో నిర్బంధించిన జైలు గోడల మీద కవిత్వాన్ని రాసి ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన కలం యోధుడు అని పేర్కొన్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి అన్న మాట ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలందరినీ ఉర్రూతలూగించిందన్నారు. సీఎం కేసీఆర్ దాశరథి మాటలనే స్ఫూర్తి గా తీసుకొని ఇప్పుడు తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసే మహాయజ్ఞం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దాశరథి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -