దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది..

291
- Advertisement -

నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా పబ్లిక్ గార్డెన్స్ జూబ్లీహాల్‌లో భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, బిసి కమిషన్ ఛైర్మెన్ బిఎస్ రాములు, టూరిజం సెక్రటరీ బుర్ర వెంకటేశం, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, కవి, రచయిత సుద్దాల అశోక్ తేజ, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.

 

కవి సమ్మేళనం అనంతరం కవులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో కవులను, కళాకారులను మంచిగా సత్కరించుకుంటున్నాం. కవిసమ్మేళనం ద్వారా కవులందరిని ఒక దగ్గర చూడడం సంతోషంగా ఉంది. పరిపాలన రాదన్న స్థితి నుండి.  ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నామన్నారు. దేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపు చూస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇంజినీర్‌గా 24 గంటలు ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశారు. త్వరలోనే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అం%A

- Advertisement -