ప్రముఖుల పేర్లు బయటపెట్టనున్న శ్రీరెడ్డి

294
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది హీరోయిన్ శ్రీరెడ్డి. తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ ద్వారా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అయితే తన దగ్గరున్న వీడియోల ద్వారా కొందరి పేర్లను బయటపెట్టిన శ్రీరెడ్డి ఎక్కడా టాలీవుడ్ పెద్దల… ప్రముఖుల పేర్లు మాత్రం చెప్పలేదు… అయితే ఇప్పుడు సస్పెన్స్ కు తెరదించుతూ అందరి పేర్లు చెప్పేయబోతున్నానంటూ షాకిచ్చింది ఈ హట్‌ బ్యూటీ.

Sri Reddy To Reveal Tollywood Celebs Names!

కొన్నాళ్లుగా తన దగ్గర టాలీవుడ్ పెద్దల బాగోతాన్ని బయటపెట్టే వీడియోలు ఉన్నాయంటూ చెప్పుకుంటూ వచ్చిన శ్రీరెడ్డి… వాటిని మీడియాకు బట్టబయలు మాత్రం చేయలేదు. అందుకే కొన్ని ఛానెళ్లు కూడా సరైన సాక్ష్యాధారాలు లేనిదే… ఎవరి పేరు బయటికి చెప్పకుండా రహస్యం మెయింటెయిన్ చేశారు. దాంతో శ్రీరెడ్డికి ఫేస్ బుక్ లో నెటిజనుల నుంచి అనేక రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ‘అందరి పేర్లూ చెబుతా అని చెప్పి – వారి పేర్లు చెబితే బీప్ సౌండ్ వేయమని ఎందుకు చెప్పావ్… నిన్నెవరు బెదిరించారు? అయినా నువ్వెవరికీ భయపడవు కదా!’ అంటూ నిలదీశాడో నెటిజనుడు. దాంతో సదరు ఛానెళ్ అభ్యంతరం వల్లే టాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పినప్పుడు బీప్ సౌండ్ వేయమన్నానని… ఇప్పుడు ఆ ఛానెల్లో అందరి పేర్లు బయటపెట్టబోతున్నానంటూ సమాధానం ఇచ్చింది శ్రీరెడ్డి. దీంతో టాలీవుడ్లో కలకలం మొదలైంది.

- Advertisement -