రాణించిన బెయిర్‌ స్టో..పంజాబ్ టార్గెట్ 202

133
bairstow

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్‌ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 201 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వార్నర్ 52 పరుగులు చేయగా మరో ఓపెనర్ బెయిర్ స్టో తృటిలో సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. 55 బంతుల్లో 6 సిక్స్‌లు,7 ఫోర్లతో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వీరిద్దరూ ఔటైన వెంటనే తర్వాత వచ్చిన మనీశ్ పాండే 1,ప్రయాగ్‌ 0,సమద్ 8 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు. చివరలో అభిషేక్ శర్మ 12,విలియమ్ సన్ 20 పరుగులు చేయడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్క్ దాటింది.