నికోలస్ పురాన్ విశ్వరూపం…17 బంతుల్లో 50!

292
puran

ఐపీఎల్ 2020లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు నికోలస్ పురాన్ కాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఏడాది ఏపీఎల్‌ లో పాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదుచేశాడు. కేవలం 17 బంతుల్లో 6 సిక్స్‌లు,2 ఫోర్లతో అర్దసెంచరీ చేసి అలరించాడు.

ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పంజాబ్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన వారిలో కేఎల్ రాహుల్ తొలిస్ధానంలో ఉన్నారు. 2018లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 2019లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు రాహుల్. ఇక 2014లో రాజస్ధాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి నాలుగో స్ధానంలో నిలిచాడు డేవిడ్ మిల్లర్‌.