ఆ రోజు రాత్రి ఏంజరిగిందంటే..భజ్జితో గొడవపై శ్రీశాంత్

34
harbajan singh

2008 ఐపీఎల్ సందర్భంగా భారత స్పిన్నర్ హర్బజన్ సింగ్- శ్రీశాంత్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే.ఈ గొడవలో శ్రీశాంత్ చెంప చెల్లుమనింపించాడు భజ్జి. ఈ గొడవ అప్పట్లో పెద్దవివాదానికి దారితీయగా తాజాగా దీనిపై స్పందించారు శ్రీశాంత్.

హర్భజన్ సింగ్ తనని చెంపదెబ్బ కొట్టిన తర్వాత కొద్దిసేపటికే ఇద్దరం కలిసి భోజనం చేసినట్లు వెల్లడించాడు శ్రీశాంత్.ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంలో సచిన్ టెండూల్కర్ సక్సెస్ అయ్యాడని చెప్పిన శ్రీశాంత్…భజ్జీపై విధించిన నిషేధాన్ని తాను వ్యతిరేకించానని తెలిపాడు.

అప్పటికే తామిద్దరం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం….తర్వాత కూడా ఆడామని చెప్పారు. గొడవ తర్వాత తానే హర్బజన్ సింగ్ దగ్గరికి వెళ్లి మాట్లాడనని వెల్లడించాడు శ్రీశాంత్.

2013 ఐపీఎల్ సీజన్‌లో స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్లు నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్.. ఈ ఏడాది సెప్టెంబరులో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు.