స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ధరెంతో తెలుసా..!

172
sputnik
- Advertisement -

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ని వేగవంతం చేసింది కేంద్రం. ఇందులో భాగంగా పలు దేశాలకు చెందిన వ్యాక్సిన్‌లకు అనుమతివ్వగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

ఈ నేపథ్యంలో దేశంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఒక డోసు ధరను రూ.948గా నిర్ణయించింది. అదే 5 శాతం జీఎస్టీతో కలిపి ఒక డోసు ధరను రూ.995.40లుగా నిర్ణయించింది. 91.6 శాతం సామర్థ్యం కలిగిన స్పుత్నిక్ వి, భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదించిన మూడవ టీకా. వారం రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాక్సిన్ రెండు కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -