స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు వెనిజులా అమోదం…

174
vaccine
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా అన్నిదేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాయి. ఇప్పటికే పలు ధనిక దేశాలు టీకాల ప్రక్రియను దాదాపుగా పూర్తిచేయగా తాజాగా వెనిజులా రష్యా వ్యాక్సిన్‌కు అమోదం తెలిపింది.

సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్‌ లైట్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌కు వినియోగానికి వెనిజులా ఆమోదం తెలిపింది. గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ కరోనాకు వ్యతిరేకంగా 79.4శాతం ప్రభావంతంగా పని చేస్తుందని ఆర్‌డీఐఎఫ్‌ తెలిపింది.

ధర మోతాదాకు పది డాలర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే వెనిజులా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను వినియోగిస్తుందని, సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ సైతం టీకాలు వేగవంతం చేయడంలో సహాయపడుతుందని ఆర్‌డీఐఎఫ్ అధిపతి కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు.

- Advertisement -