అన్ని అనుమతులుంటేనే తెలంగాణలోకి అనుమతి…

106
sp
- Advertisement -

ఏపి నుండి తెలంగాణకు కోవిడ్ చికిత్సకు వచ్చే అంబులెన్సులకు, వ్యక్తి గత వాహనాలకు అనుమతి తప్పని సరని తెలిపారు సూర్యాపేట జిల్లా ఎస్పీ
ఆర్. భాస్కరన్. ఆంధ్రా నుండి తెలంగాణ కు కోవిడ్ చికిత్స కోసం వచ్చే అంబులెన్సులను, వ్యక్తిగత వాహనాలను ఆంధ్ర తెలంగాణ సరిహద్దు వద్ద తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు.

కోవిడ్ చికిత్సకు వచ్చే వారు సంబంధిత హాస్పిటల్ అపాయింట్ మెంట్ తో పాటుగా డైరెక్టట్ ఆఫ్ హెల్త్ కోవిడ్ కంట్రోల్ సెంటర్ వారి ఆథరైజేషన్ పాస్ కచ్చితంగా ఉంటేనే తెలంగాణాలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. హాస్పిటల్ అపాయింట్ మెంట్ లెటర్ ఒక్కటి ఉంటే సరిపోదు అని, ఇది గమనించాలని అన్నారు. అన్ని అనుమతి పత్రాలు పొందిన తర్వాతే చికిత్సకు బయలుదేరాలి… సరిహద్దు తనిఖీల్లో ఇబ్బందులు పడవద్దు అని అన్నారు.

- Advertisement -