TTD:భార‌తీయ క‌ళ‌ల‌ను విశ్వ‌వ్యాప్తం చేయాలి

24
- Advertisement -

భార‌తీయ పురాత‌న సంస్కృతి, సాంప్ర‌దాయాలైన సంగీత‌, నృత్య క‌ళ‌ల‌ను విశ్వ‌వ్యాప్తం చేసి, భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించాల‌ని జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి పిలుపునిచ్చారు. తిరుప‌తిలోని ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాలను మంగ‌ళ‌వారం జేఈవో అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ, శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ తరతరాలుగా మ‌న పూర్వీకులు అందించిన‌ ప్రాచీన కళ‌లకు ప్రాణం పొస్తున్న గొప్ప సంస్థ అన్నారు. సంగీతం, నృత్యం అతి కష్టమైన, మనస్సుకు దగ్గరగా ఉన్న విద్య అని చెప్పారు. ఎంతో చ‌రిత్ర ఉన్న సంగీత నృత్య క‌ళాశాల, విశ్వ‌విద్యాల‌యం స్థాయికి చేరుకోవ‌డానికి అధ్యాప‌కులు, విద్యార్థులు కృషి చేయాల‌న్నారు.

అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. క‌ళాశాల‌లో విద్య‌ను అభ్యసిస్తున్న విద్యార్థుల‌కు టీటీడీ స్కాలర్‌షిప్‌ రూపంలో లక్ష రూపాయలు అందిస్తొందని చెప్పారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వెనుక ఉన్న‌ పాత టీటీడీ పరిపాలన భవనంలో సంగీత, నృత్య మ్యూజియం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. క‌ళాశాల‌లోని విద్యార్థుల సౌక‌ర్యార్థం రూ.11 కోట్ల‌తో నూత‌న హాస్ట‌ల్ భ‌వనాల‌ను నిర్మిస్తున్నామ‌న్నారు. కళాశాలలో వ‌జ్రోత్స‌వాలు వారం రోజులు పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల విద్యార్థులు త‌మ సంగీత‌, నృత్య‌, వాద్య సంగీతంలో శ్రీ‌వారి కీర్తిని విశ్వ‌వ్యాప్తం చేయాల‌ని పిలుపునిచ్చారు.

సిఈవో  శేష శైలేంద్ర మాట్లాడుతూ, మ‌న వేదాల‌లో ఉన్న‌ పురాతన కళ‌లను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భారతదేశం భరతనాట్యం, కూచిపూడి తదితర నాట్యాలు సంగీత వాద్య కళ‌ల సమూహమ‌న్నారు. భార‌తీయ జీవన విధానం మన సంస్కృతిపై ఆధారపడి ఉంటుంద‌ని, మన సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను నిలబెట్టిన సనాతన మహర్షులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. క‌ళాశాల స్థాయిలోనే అష్టాదశ ప్రాజెక్ట్ రావడం గొప్ప విషమ‌న్నారు. మన వేదాల్లోని సంస్కృతిని క‌ళాకారులు ఏ విధంగా ప్రదర్శించాలి, తదితర అంశాలను వివరించారు.

Also Read:సిల్వర్ స్క్రీన్ పైకి మహేష్ కూతురు

- Advertisement -