సిల్వర్ స్క్రీన్ పైకి మహేష్ కూతురు

23
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాలా సూపర్ హిట్ సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నారు మహేష్ బాబు. తనకంటూ మహేష్ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అయితే సినిమాల్లో మాస్ హీరోగా కనిపించే మహేష్ బాబు.. ఇంట్లో మాత్రం చాలా హోమ్లీగా, పక్కా ఫ్యామిలీ మెన్ గా ఉంటాడట.పైగా తన కూతురు సితార అంటే మహేష్ కి భయం అట. సితార ఏం కోరుకున్నా మహేష్ వెంటనే తెచ్చి ఇస్తాడట.

అలాగే, సోషల్ మీడియాలో సితార కూడా నిత్యం తన అప్ డేట్స్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. అయినా, మహేష్ ఆమె ఇష్టాన్ని కాదు అనలేకపోతున్నాడట. ఈ విషయంలో ఇక తన కూతురు సితార గురించి ఎంత చెప్పునా తక్కువే అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మహేష్ కామెంట్స్ కూడా చేశాడు. అయితే సితార కొత్త ఫోటో షూట్స్ చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. సితార హీరోయిన్ మెటీరియల్.. ఆమె మరో నాలుగేళ్ళ తర్వాత హీరోయిన్ గా ట్రై చేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇదిలా ఉంటే.. ఇటీవల సితార తల్లి నమ్రత తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్స్ సితార గురించి మాట్లాడుతూ.. సితారను సినిమాల్లో తీసుకు రండి. ఆమెను బిగ్ స్క్రీన్ పై చూడాలనేది మా కోరిక.. అంటూ అడిగాడు. దానికి సమాధానంగా నమ్రత మాట్లాడుతూ.. నటన పై సితార కి ఇంట్రెస్ట్ ఉంది అంటూ బదులిచ్చింది. దీంతో భవిష్యత్తులో సితార సినిమాలో హీరోయిన్ గా నటించనుంది అనేది అర్థమవుతోంది. అందుకు తగ్గట్టుగానే సితార వైజాగ్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటుందట.

Also Read:భోజనానికి ముందు పెరుగు తింటే?

- Advertisement -