సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. ఈ సినిమా గురించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా గుడ్ న్యూస్ చెప్పారు సందీప్. అమెరికాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సలార్ షూటింగ్ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ప్రభాస్ కెరీర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా వస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా స్పిరిట్ ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని తెలుస్తోంది.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’తో బిజీగా ఉన్నారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాతో పాటు ‘సలార్’, ‘కల్కి’ సీక్వెల్స్ కూడా చేయాల్సి ఉంది.
Also Read:ఉగాది రాశి ఫలాలు… 2025