స్పెర్మ్ కౌంట్ పెంచే ఆహార పదార్థాలు!

50
- Advertisement -

నేటి రోజుల్లో చాలమంది పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం. మారుతున్న జీవన విధానం కారణంగానో లేదా విపరీతమైన పని పొత్తిడి కారణంగానో పురుషుల్లో రోజు రోజుకు శుక్ర కణాల సంఖ్య దారుణంగా పడిపోతోందని అద్యయానాలు చెబుతున్నాయి. ఒక పురుషుడు దాంపత్య జీవితం ఆనందంగా గడపాలన్న లేదా జీవిత భాగస్వామితో పిల్లలు కనాలి అన్న ఆరోగ్య కారమైన శుక్ర కణాలు చాలా అవసరం. దాంతో శుక్ర కణాల నాణ్యత మరియు సంఖ్య పెంచుకునేందుకు పురుషులు రకరకాల మెడిసన్స్ తీసుకుంటూ ఉంటారు. వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. అయినప్పటికి సరైన ఫలితాలు మాత్రం కనిపించవు. కానీ మనం తినే ఆహారంలో కొన్నిటిని చెరుచుకోవడం వల్ల శుక్రకణాల సంఖ్య వేగంగా పెరగడంతో పాటు వాటి నాణ్యతా కూడా మెరుగ్గా ఉంటుందని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం !

అరటిపండు
అరటిపండులో పురుషులకు ఎంతగానో ఉపయోగపడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఏమైనో ఆమ్లాలు జననేంద్రియాలకు రక్త ప్రసరణను పెంచుతాయి. అంతేకాకుండా అరటిపండులో ఉండే విటమిన్ ఏ, సి, బి1 వంటివి స్పెర్మ్ ఉత్పత్తిని ప్రోస్తహిస్తాయి.

దానిమ్మ
దానిమ్మ పండు కూడా పురుషులకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతాయి. అంతే కాకుండా శుక్ర కణాలు ఆరోగ్యంగా ఉండడంలో దోహదం చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఒక దానిమ్మ పండు లేదా జ్యూస్ తాగడం మంచిదట.

కివిపండ్లు
సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉండే కివిపండ్లు కూడా పురుషుల్లో వీర్య వృద్దిని పెంచుతాయట. ఇందులో ఉండే విటమిన్ సి మరియు ఇ వీర్య వృద్దిని పెంచడంతో పాటు వాటి నాణ్యతాను కూడా మెరుగుపరుస్తాయట. కాబట్టి సంతానోత్పత్తి సమస్యలతో బాధపడే వారు కివిపండ్లను క్రమం తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా జమపండ్లలో కూడా స్పెర్మ్ కౌంట్ ను పెంచే గుణాలు ఉంటాయట. అలాగే టమాటో, గుమ్మడి విత్తనాలు, బెర్రిస్.. వంటివి కూడా పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లో స్పెర్మ్ కౌంట్ తో ఇబ్బంది పడే పురుషులు వారియొక్క డైలీ ఆహార డైట్ లో ఇవి ఉండేలా చూసుకోవాలని నిపుణుల సూచన.

Also Read:జగన్ పై పోటీ.. రవి గెలిచేనా ?

- Advertisement -