జగన్ పై పోటీ.. రవి గెలిచేనా ?

16
- Advertisement -

టీడీపీ జనసేన కూటమి తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారనే దానిపై స్పష్టత వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచే మరోసారి పోటీలో నిలవగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగలగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు తేలిపోయింది. గత ఎన్నికల్లో కూడా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇక మరోసారి ఆయన అదే స్థానం నుంచి బరిలోకి దిగడంతో మంగళగిరి సీటు ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంచితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టేందుకు పులివెందులలో టీడీపీ ఎవరిని బరిలో దించబోతుంది అనేది గత కొన్నాళ్లుగా ఉత్కంఠ రేపిన అంశం. ఎట్టకేలకు జగన్ ను ఢీ కొట్టే టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. ఎమ్మెల్సీ బీటెక్ రవికి పులివెందుల టికెట్ కేటాయించినట్లు టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. .

2019 జగన్ కు పోటీగా సింగారెడ్డి సతీశ్ రెడ్డిని బరిలోకి దించింది టీడీపీ. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై జగన్మోహన్ రెడ్డి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1978 నుంచి పులివెందుల నియోజక వర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఇలాంటి చోట వైఎస్ జగన్ కు చెక్ పెట్టడం అంతా తేలికైన విషయం కాదు. అయితే పులివెందులలో మాస్ లీడర్ గా బీటెక్ రవి ( రవీంద్రనాథ్ రెడ్డి ) కి పేరుంది.

2011 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికి 2017 శాసన మండలి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాంతో ఈసారి బీటెక్ రవి జగన్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ అడపా దడపా వినిపిస్తోంది. పైగా వైఎస్ వివేకా హత్య కేసు, షర్మిల జగన్ మధ్య విభేదాలు.. వంటి అంశాలు బీటెక్ రవికి ప్లెస్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ కలిసొచ్చి బీటెక్ రవి విజయం సాధిస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోనే పెను సంచలనం అయ్యే అవకాశం ఉంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీటెక్ రవి ఎంతమేర పోటీనిస్తారో చూడాలి.

Also Read:Janasena:’సిద్దం’మైన టీడీపీ జనసేన?

- Advertisement -