మంత్రి కేటీఆర్ విన‌తికి కేంద్రం ఓకే..!

219
Special turmeric cell for Telangana farmers assured
- Advertisement -

 పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కె తారకరామారావు రాసిన లేఖకు కేంద్ర మంత్రి స్పందించారు. స్పైసెస్‌ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కోరకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు హామీ ఇచ్చారు. పసుపు పంట మార్కెటింగ్‌ రీసెర్చీ ద్వారా పంట అభివృద్ది చేయాల్సిన బాద్యత కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ శాఖలపై ఉందని సురేష్‌ ప్రభు అన్నారు. స్పైసెస్‌ బోర్డు పసుపుతో పాటు ఇతర ఎగుమతులు, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తుందన్నారు.

Special turmeric cell for Telangana farmers assured

రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని కొద్దికాలం క్రితం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు రాసిన లేఖకు సురేశ్‌ప్రభు శుక్రవారం జవాబు రాశారు.  ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రత్యేక సెల్‌ను స్పైసెస్‌ బోర్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ట్రేడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ ఎక్స్‌పోర్ట్‌ స్కీం పథకం కింద ప్రత్యేకంగా ఓస్పైసెస్‌ పార్క్‌ను కూడా నెలకొల్పుతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.స్పైసెస్ బోర్డు పసుపుతోపాటు ఇతర  స్పెసెస్ ఎగుమతులు, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ నిర్వహిస్తున్నదని అన్నారు.

- Advertisement -