మూడు రాష్ట్రాల ఫలితాలపై ఉత్కంఠ

206
Nagaland, Meghalaya, Tripura election results
- Advertisement -

మూడు ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, త్రిపుర, మేఘూలయాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం నాటికి వెలువడనున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్ లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల్లోనూ 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వివిధ కారణాలతో ఒక్కో స్థానంలో ఎన్నిక జరగలేదు.

Nagaland, Meghalaya, Tripura election results

త్రిపురలో ఐపీఎఫ్‌టీ కూటమితో కలిసి బీజేపీ బరిలో దిగింది. ఇక్కడ 57 స్థానాల్లో సీపీఎం పోటీ చేసింది. మరో రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది సీపీఎం. 51 స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను పోటీ చేయించింది. మిగతా 9 స్థానాలను ఐపీఎఫ్‌టీకి బీజేపీ కేటాయించింది. కాంగ్రెస్ 59, తృణమూల్ కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేసింది. అయితే త్రిపురలో ప్రధాన పోటీ సీపీఎం, బీజేపీ మధ్య ఉంది. నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో కలిసి బీజేపీ పోటీ చేసింది. ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 18 స్థానాల్లో పోటీ చేసింది. మేఘాలయలో కాంగ్రెస్ 59 స్థానాల్లో, బీజేపీ 47 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీ చేయించింది.

మూడు రాష్ట్రాల్లోనూ గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో మాత్రం పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. త్రిపురలో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష కూటమికి ఓటమి తప్పదని, ఇక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని రెండు ఎగ్జిట్ పోల్ సర్వేల్లో తేలింది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని సర్వేల్లో తేలింది.

- Advertisement -