జ‌య‌శంక‌ర్ సార్ కు నివాళుల‌ర్పించిన స్పీక‌ర్ పోచారం

243
pocharam srinivas reddy
- Advertisement -

నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి. ఈసంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్నారు. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.

ఈసంద‌ర్భంగా స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా యావజ్జీవతాన్ని తెలంగాణ ఉద్యమానికే అంకితం చేసిన గొప్ప వ్యక్తి స్వర్గీయ ఆచార్య జయశంకర్ అని తెలిపారు.తెలంగాణ స‌మాజం ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ ఎన్న‌టికు మ‌ర‌వ‌బోద‌న్నారు. రాష్ట్ర సాధ‌న కోసం జ‌య‌శంక‌ర్ సార్ చాలా క‌ష్ట‌ప‌డ్డారని గుర్తు చేసుకున్నారు.

- Advertisement -