గోదావరి జలాలు మంజీరా నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరిన ఈరోజు నిజంగా చారిత్రాత్మకం..లక్షలాది రైతుల సాగునీటి కష్టాలకు ముగింపు పలికిన సందర్భం..నిజాంసాగర్ ప్రాజెక్టు ఏడాది మొత్తం నిండు కుండలా ఉండాలనే నా కల నిజమైన రోజు..ఇంత గొప్ప విజయం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి వలనే సాధ్యం అయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి..
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు హల్ధీ వాగు ద్వారా మంజీర నదిలో ప్రవహించి నేటి సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి .
ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సరిగ్గా నీరందించలేని నిజాంసాగర్ ప్రాజెక్టు ఇక నుంచి 365 రోజుల నిండుగా ఉంటుంది.ఆయకట్టు లోని రైతులకు ఏటా రెండు పంటలకు డోకా లేదు. వానల కోసం ఆకాశం వైపు, నీళ్ళ ప్రవాహం కోసం ఎగువ మంజీర నది వైపు ఎదురు చూడాల్సిన అవసరం లేదు.రైతులు దైర్యంగా ఇగ రోహిణి కార్తెలోనే నార్లు పోసుకోవచ్చు.నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటుగా త్వరలోనే నిర్మాణం చేసుకోనున్న నాగమడుగు ఎత్తిపోతల పథకం ద్వారా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో మరో నలబై వేల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
మంజీర నదిలో నిత్యం నీళ్లు ప్రవహిస్తాయి కావున నదిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు, మోటార్ల ద్వారా సాగు చేసుకుంటున్న రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుంది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండటం వలనే ఇంత గొప్ప మార్పు జరిగింది. మరెవరూ ఇంత సాహసం చేయలేరు. తమ కష్టాలను దూరం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రైతులు కొలుస్తారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.