కల్నల్ సంతోష్ త్యాగం వెలకట్టలేనిది: స్పీకర్ పోచారం

203
speaker pocharam
- Advertisement -

దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు త్యాగం వెలకట్టలేనిదన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. దేశ రక్షణ కోసం సంతోష్ బాబు చేసిన ప్రాణ త్యాగాన్ని భారతదేశ ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకుంటారని చెప్పారు.సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు పోచారం.

చైనా సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో జాతి మొత్తం జవాన్లకు సంఘీభావంగా నిలిచింది. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలను సైనిక, ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -