దేశాభివృద్ధిలో కీలకంగా మైనింగ్‌: స్పీకర్ పోచారం

428
speaker pocharam
- Advertisement -

భారత్ దేశ అభివృద్ధిలో మైనింగ్ డిపార్ట్‌మెంట్‌ కీ రోల్ పోషిస్తుందని తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో మైనింగ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ , ఇన్వెస్ట్మెంట్స్,ఇష్యూస్ అండ్ ఛాలెంజ్ స్ అంతర్జాతీయ సదస్సుని హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు స్పీకర్ పోచారం.

ఈ సందర్భంగా మాట్లాడిన పోచారం …మైనింగ్ లేనిది ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదన్నారు. మైనింగ్ లేనిదే అభివృద్దే లేదన్నారు. 2004 నుంచి 2014 వరకు ఇసుక ద్వారా 39 కోట్ల ఉండే ఆదాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన పాలసీతో రూ. 2383 కోట్లకి పెరిగిందన్నారు.

రోజురోజుకి దేశంలో మైనింగ్ ఉత్పత్తి పెరిగిపోతుందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. సహజ వనరులు అధికంగా ఉన్న దేశం మనదని..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన మైనింగ్ ,ఇండస్ట్రీ పాలసీలతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. టీఎస్‌ఐపాస్‌తో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చాయని చెప్పారు.

- Advertisement -