- Advertisement -
వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఓం బిర్లా విలేకరులతో మాట్లాడారు.
బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్యం లభించి 75 ఏండ్లు పూర్తయ్యే సందర్భంలో నూతన పార్లమెంట్ భవనం సిద్ధం కానుందని వెల్లడించారు. 2022 ఆగస్ఠ్ నాటికి నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు ముగిసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
లోక్‌సభలో పరిణామాలు తనను బాధించాయని స్పీకర్ ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు.సమావేశాల్లో ఓబీసీ బిల్లు సహా 20 బిల్లులు సభ ఆమోదం పొందాయి… ఈ సమావేశాల్లో ఆశించిన విధంగా సభా కార్యక్రమాలు సాగలేదని అన్నారు. సమావేశాల్లో సభ కేవలం 21 గంటలే సజావుగా నడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -