Rahul:రాహుల్‌ వ్యాఖ్యలపై దుమారం..తొలగింపు

14
- Advertisement -

ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అగ్నివీర్‌, మైనార్టీ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలపై బీజేపీ తీరును తప్పుబట్టారు రాహుల్.

ఈ సందర్భంగా పరమశివుడి చిత్రపటాన్ని చూపిస్తూ.. హిందువులు ఎప్పుడూ భయాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయరు… కానీ, హిందువులుగా చెప్పుకునే కొందరు మాత్రం కేవలం హింస, విద్వేషం, అసత్యమే మాట్లాడతారు. మీరు హిందువులే కాదు అని వ్యాఖ్యానించారు. దీనికి బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

రాహుల్‌ వ్యాఖ్యలను ప్రధాని మోదీ, అమిత్‌ షా ఖండించారు. హిందువులకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ కామెంట్స్ చేశారని…ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది.దీంతో రాహుల్‌ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించారు.

Also Read:‘డబుల్ ఇస్మార్ట్’ ..స్టెప్పామార్

- Advertisement -