స్పెయిన్‌లో ఉగ్రదాడి…13 మంది మృతి

228
Spain hunts driver who killed 13 in Barcelona
- Advertisement -

స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. ప్రపంచంలోనే మూడో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బార్సిలోనాలోని లాస్ రాంబ్లాస్‌లో జరిగిన ఈ దాడిలో 13 మంది దుర్మరణం చెందగా సుమారు 100 మందికి గాయాలయ్యాయి. లాస్ రాంబ్లాస్‌లోని అత్యంత రద్దీగా ఉండే రహదారిలో పాదచారులను దుండగుడు వ్యాన్‌తో తొక్కించాడు. ఫుట్‌పాత్‌పై నడుస్తున్న వారిపైకి ఒక్కసారిగా వ్యాన్ దూసుకొచ్చింది. ఏమవుతోందో తెలుసుకునేలోపే జనాన్ని నలిపేసింది. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

Spain hunts driver who killed 13 in Barcelona
వ్యాన్ బీభత్సానికి మృతదేహాలు చెల్లచెదురుగా పడ్డాయి. ఎక్కడికక్కడ తీవ్రగాయాలతో పడిపోయిన క్షతగాత్రులతో ఆ ప్రాంతంగా భయానకంగా మారింది. వ్యాన్ వేగంగా దూసుకొస్తుండడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు పెట్టారు. సమీపంలోని రెస్టారెంట్లు, దుకాణాల్లోకి వెళ్లి కొందరు ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బార్సిలోనాలో హై అలర్ట్ ప్రకటించారు.

దుండగులను ఆగిపోవాలని పోలీసులు హెచ్చరించిన ఫలితం లేదు. దీంతో భద్రతా దళాలు వారిని కాల్చి చంపాయి. ఈ ఘటనలో నలుగురు అనుమానితులు మృతి చెందారు. నిన్న ఉగ్రదాడి జరిగిన బార్సిలోనాకు దక్షిణాన 130 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు మూసివేశారు. కాగా, ఈ దాడికి తామే పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది.

2004 తర్వాత స్పెయిన్‌లో ఉగ్రవాదుల దాడులేవీ జరుగలేదు. 2004 మార్చ్ నెలలో జిహాదీలు మాడ్రిడ్‌లోని ఓ లోకల్ రైలుపై జరిపిన బాంబుదాడిలో 191మంది ప్రాణాలు కోల్పోయారు. 2015లో ఓ వ్యక్తి లాస్ రాంబ్లాస్ వీధిలోనే కాల్పులు జరుపగా ఒకరు మృతిచెందారు. అతడిని పట్టుకునే క్రమంలో మరొకరు చనిపోయారు. అయితే, ఆ కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తమేదీ లేదని పోలీసులు తేల్చారు. ఇటీవలి కాలంలో ఫ్రాన్స్, బెల్జియం, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఉగ్రవాదులు వాహనాలతో దాడులకు దిగగా, తాజాగా బార్సిలోనాలో జరిగింది కూడా అలాంటి ఘటనే కావచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -