- Advertisement -
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మేదాంత ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ములాయంకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పలువురు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోందని సమజ్‌వాది పార్టీ అధికారిక ట్విటర్ పేర్కొన్నారు.
ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం.. గత ఆదివారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
- Advertisement -