ములాయం తృటిలో చేజార్చుకున్న ప్రధాని పదవి

99
- Advertisement -

ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ములాయం సింగ్‌ యాదవ్‌ అలంకరించిన పదవులు ఎన్నో. కానీ ఒకే ఒక్క పదవి మాత్రం మిస్సయిందని మీకు తెలుసా. అవునండీ.. భారత ప్రధాని అయ్యే అవకాశం వచ్చి తృటిలో తప్పిపోయింది. కేంద్ర రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌ కీలకస్థానం పోషిస్తుంది. యూపీ ఆనగానే ములాయం పేరు గుర్తొచ్చేలా తనదైన శైలిలో రాజకీయ ముద్ర వేశారు. అందుకే ఆయన్ను అభిమానులు ప్రేమగా నేతాజీ అని పిలుచుకునేవారు.

మల్లయోధుడైన ములాయం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని పదవికి దేవెగౌడ రాజీనామా చేసిన తర్వాత ములాయంకు పీఎం అయ్యే ఛాన్స్ దక్కింది. అయితే ఆయన ప్రత్యర్థులైన లాలూ ప్రసాద్, శరద్ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ఛాన్స్ మిస్సైంది. ఒకవేళ ఆయనకు ప్రధాని పదవి దక్కి ఉంటే గుజ్రాల్ కన్నా ఎక్కువ కాలం కూటమిని కాపాడేవారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

- Advertisement -