ఇండస్ట్రీలో కులగజ్జిపై స్పందించిన బాలు!

227
balu interview
- Advertisement -

ఇండస్ట్రీలో కులగజ్జిపై బహిరంగంగానే స్పందించారు బాలు. సినిమా రంగంలో కులగజ్జి పెరిగిపోయింది. కులాలపేర్లన్నీ బయటికి వచ్చేశాయి. నిర్మాతలకు గౌరవం లేదని తెలిపారు బాలు. అదేవిధంగా లాస్ట్ ఇంటర్వ్యూలో హీరో కృష్ణతో జరిగిన గొడవ గురించి స్పందించారు.

ఒక సంస్థ నుంచి నాలుగైదేళ్లయినా బకాయిలు రాకపోవడంతో, ఫోన్‌ చేసి నిర్మాతను అడిగాను. దురుసుగా మాట్లాడారు. దాంతో నేను ఫోన్‌ పెట్టేశాను. ఆ తరువాత కృష్ణ ఫోన్‌ చేసి, మీరు పాడకపోతే నా సినిమాలు రిలీజ్‌ కావన్నారట.. మీ డబ్బులు వెంటనే పంపుతాను. మీ తరఫున మిత్రుడొకరు నాకు 20వేలు బకాయి ఉన్నారు కదా? అది వెంటనే పంపండి అని ఫోన్‌ పెట్టేశారు. ఆయన చెక్కు పంపారు. నేను కూడా 20వేలు పంపేశాను. రెండు,మూడేళ్లు ఇద్దరం కలిసి పనిచేయలేదు. ఆ తర్వాత వేటూరి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేశారు. నేను పద్మాలయ ఆఫీసుకు వెళ్లి గతంలో జరిగినదాని గురించి కృష్ణకు వివరించబోగా.. అదంతా మరచిపోండి, మళ్లీ కలిసిపనిచేద్దాం అని తెలిపారని గుర్తుచేశారు బాలు.

తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు బాలు. అమ్మాయి గృహిణి. బాధ్యతల వల్ల పాడడం మానేసింది. మా అబ్బాయి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేశాడు. సంగీతం అన్నాడు. నటన అన్నాడు. సినిమాలు తీస్తా అన్నాడు. 5 సినిమాలు తీశాడు. 11 కోట్లు పోయాయి. ఇంకా సినిమాలు తీసేపనిలో ఉన్నాడు. బాగా కృషి చేస్తున్నాడు. మా అమ్మాయికి, అబ్బాయికీ కూడా కవలపిల్లలు. అది తెలిసి కొందరు నన్ను కవలల తాతయ్య అంటారు.

- Advertisement -