బాలు కీర్తి తరతరాలు నిలిచిపోతుంది:సినీ ప్రముఖులు

188
balu

ప్ర‌ముఖ గాయకుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయింది. బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్న ప్రముఖులు త‌న పాట‌ల‌తో కోట్లాది మంది హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని కొనియాడారు.

బాలు కీర్తి త‌ర‌త‌రాలు నిలిచిపోతుంద‌ని సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అన్నారు. బాలు ఉన్న కాలంలో ఉండ‌టం మా అదృష్టంగా భావిస్తున్నామ‌న్నారు.

బాలు లేని లోటు ఊహించ‌లేనిది. ఆగిపోయింది మీ గుండె మాత్రమే..గొంతు కాదు- ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్

ఎస్పీ బాలు మృతితో నా హృద‌యం ముక్క‌లైంది. సినీప‌రిశ్ర‌మ‌కు బాలు చేసిన వెల‌క‌ట్ట‌లేని సేవ‌ల‌కు ధన్యవాదాలు- వ‌రుణ్ తేజ్

బాలు మృతితో ఓ లెజెండ్ ను కోల్పోయాం- తమ‌న్

తన జీవితంలో ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని గొప్ప వ్య‌క్తి ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం – సినీ న‌టి ర‌మ్య‌కృష్ణ