మొక్కలు నాటిన గట్టు ఎంపీపీ విజయ్ కుమార్..

252
green challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గద్వాల్ ఎం.ఎల్.ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ తన కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు గట్టు మండలం ఎం.పి.పి విజయ్ కుమార్..

న్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నేడు తన కార్యాలయంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అంగడి బస్వరాజు , ఎం.ఆర్.ఓ , కార్యాలయ సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు ఎంపీపీ విజయ్ కుమార్.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మండలం లోని ప్రతి గ్రామాన్ని పచ్చదనంతో ఉండేలా తీర్చి దిద్దుతామని తెలుపుతూ సోషల్ వేదిక ద్వారా మరో ముగ్గురు గ్రామ సర్పంచ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతు వారు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని ఎంపిపి విజయ్ కుమార్ తెలిపారు.