ఆఖరి కోరిక తీరకుండానే..!

265
balu
- Advertisement -

ఎస్పీబీ… ఈ మూడు అక్షరాలు సినిమా పాటలకు ఒక బ్రాండ్. 54 ఏళ్ల సుదీర్ఘ కళా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు. అంతకుమించి సత్కరాలు,అందరి మన్ననలు. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న బాలు ఇకలేరనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. డాన్స్ రానివారితో కూడా స్టెప్స్ వేయించే శక్తి… మ్యూజిక్ తెలియనివారితోనూ హమ్మింగ్ చేయించే పవర్ బాలు పాటకు సొంతం. కనీసం రెండు తరాల జీవితాలు బాలూ గారి పాటతో పెనవేసుకుని ఉంటాయి. ఒక తరం పూర్తిగా బాలూగారి పాటలు వింటూ పెరిగింది. అలాంటి బాలు ఇకలేరనే వార్త వినడానికే జీర్ణించుకోలేని నిజం.

ఇక రీసెంట్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన చివరి కోరిక చావంటే తెలియకుండా కన్నుమూయాలి. ఓపిక ఉన్నంతవరకు పాడుతుండాలని వెల్లడించారు. అయితే కరోనాతో దాదాపు 50 రోజుల పాటు పోరాడిన బాలు మృత్యువు ముందు ఓడిపోయారు.

తనకు సంగీతం రాదని ఇంజనీరు కావాలని కలలు కని గాయకుణ్నయ్యానని తెలిపారు. 20 సంవత్సరాల పాటు సిగరెట్లు తాగాను. గాయకుడిగా ఏ నిబంధనలు పెట్టుకోలేదు. 40 సంవత్సరాలుగా రోజుకు 10 గంటలపాటు పాడుతూ వచ్చాను. అదే నా ప్రాక్టీసు. స్వరపేటికకు రెండుసార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా పాడుతూనే ఉన్నాను. ఇదంతా విధిరాత అనుకుంటానని వెల్లడించారు బాలు.

- Advertisement -