జూన్‌ 1న కేరళకు నైరుతి రుతుపవనాలు..

246
southwest monsoon
- Advertisement -

రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.

రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. దీని వలన సుమారుగా జూన్ 1 వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.

చత్తీస్ గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 2.1 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. చత్తీస్ గఢ్ నుండి లక్షదీవులు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మరియు కేరళ మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కోమరంభీం, నిజామాబాద్, జగిత్యాల మరియు కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

- Advertisement -