టీవీ (టెలివిజన్)… ప్రస్తుతం అందుబాటగులో దృశ్య ప్రసార మాధ్యమం. ఒకప్పుడు సినిమాలు సీరియళ్లు చూడాలంటే జనాలందరూ టీవీల ముందు కూర్చునేవాళ్లు. అయితే ప్రస్తుతం ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. దీంతో సెల్ ఫోన్లలోనూ వీడియో స్ట్రీమింగ్ అందుబాటులో ఉండడంతో చాలా మంది అందుబాటులో ఉన్న ఫోన్లలలోనే కావాల్సిన ప్రోగ్రాంను కోరుకున్న సమయంలో చూసేస్తున్నారు.
అయితే డిజిటల్ యుగంలో ఎన్ని ఫోన్లు వచ్చినా.. ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా చాలా మంది టీవీల ముందు కూర్చొని చూసేందుకు ఇష్టపడుతున్నారట. మారుతున్న కాలంలో డిజిటల్ యుగంలోనూ టీవీలకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఉత్తర భారతంలో కంటే దక్షిణ భారతంలోనే ఎక్కువ మంది టీవీలను చూస్తున్నట్టుగా బ్రాడ్‌క్యాస్ట్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని 95 శాతం ఇండ్లల్లో టీవీలు ఉన్నాయని సర్వే తెలిపింది.
కేవలం ఈ 5 రాష్ట్రాల్లోనే 259 మిలియన్ టీవీ సెట్లు ఉన్నట్లుగా బ్యాడ్ క్యాస్ట్ ఇండియా పేర్కొంది.. 2016 తర్వాత 8 శాతం టీవీ కొనుగోల్లు పెరిగాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 66 శాతం మాత్రమే టీవీ అందుబాటులో ఉన్నది. అయితే దాంట్లో ఒక్క దక్షిణ భారత్‌లోనే 95 శాతం మంది ఎక్కువ టీవీ చూస్తారని తేలింది. మొత్తానికి ఉత్తర భారత ప్రజల కంటే దక్షిణ భారత ప్రజలే ఎక్కువగా టీవీలకు అతుక్కుపోతున్నారని స్పష్టమవుతోంది.