హైదరాబాద్ నగరంలో రోజుకొక‌్క ఫుడ్ వెరైటీ ఎంటర్ అవుతోంది. చైనీస్, కాంటినెంటల్ మొదలుకొని, నార్త్ ఇండియన్ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటైమ్‌లను నగరంలోని ఆహార ప్రియులకు అందిస్తూ వస్తోంది ఫిలిం నగర్‌లో ఉన్న”ఫిల్మీ జంక్షన్” రెస్టారెంట్. తాజాగా దక్షిణ భారత వంటకాలను కూడా ఈ రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. సౌత్ ఇండియన్ థాలితో పాటు,ఫిల్మీ బ్రేక్ ఫాస్ట్ పేరుతో బ్రేక్ ఫాస్ట్ వెరైటీలు కూడా “ఫిల్మీ జంక్షన్” మెనూలో వచ్చి చేరాయి. ఆదివారం జరిగిన ఈ ఫుడ్ లాఛింగ్ ఈవెంటలో హీరో గోపిచంద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరోయిన్ అక్షత, దర్శకుడు వీరభద్రం,వీరు.కె, నిర్మాత మల్కాపురం శివ కుమార్ ,తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అన్నీ తరహా ఆహారాలను ఒకే చోట టేస్టీగా అందిస్తూ అటు సినిమా ప్రియులను, ఇటు ఆహార ప్రియులను ఒకేసారి ఫిల్మీ జంక్షన్ ఇంప్రెస్ చేస్తోందని విచ్చేసిన అతిథులు తెలిపారు. ఎప్పటికప్పుడు ఆహార ప్రియుల టేస్ట్ కు తగ్గట్టుగా మెనూలను యాడ్ చేస్తూ అందరికీ అందుబాటు ధరలో, కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా “ఫిల్మీ జంక్షన్” ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు నంద కుమార్, శ్రీకర్ నాయుడు, రామకృష్ణ, ప్రమోద్, నందులు తెలిపారు.