జీఎస్టీ దెబ్బకు..థియేటర్లు బంద్‌..!

188
- Advertisement -

ఇప్పటికే జి.ఎస్.టి.భారాన్ని వ్యతిరేకిస్తూ పలు వ్యాపార యజమానులు నిరసనలు తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు తమిళనాడులో సినిమా థియేటర్ల యజమానులు సోమవారం నుంచి నిరవధికంగా థియేటర్లను మూసివేసి నిరసనలు తెలియజేయడానికి సిద్ధం అవుతున్నారు.

Film theatres in Tamil Nadu to begin indefinite strike against GST

జీఎస్టీ పేరుతో తమపై వేసిన భారాన్ని మోస్తూ థియేటర్లు నడిపే సామర్థ్యం లేదని, అందుకే నేటి నుంచి తమిళనాడులోని సినిమా థియేటర్లను మూసివేస్తున్నామని థియేటర్ల యాజమాన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం థియేటర్స్‌ అధ్యక్షుడి ఇంట్లో చర్చలు జరిపిన యజమానులు, అనంతరం ఇవాళ నుండి థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

రూ.100 లోపు టికెట్లపై 18శాతం, అంతకు మించిన టికెట్స్ పై 28 శాతం జి.ఎస్.టి. విధించబడింది. అంతబారీగా పన్ను విధిస్తే ఇక థియేటర్లలో సినిమాలు నడిపించడం చాలా కష్టమని చెపుతున్నారు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ ఉన్న హాలీవుడ్ సినిమాలతో సమానంగా ప్రాంతీయ సినిమాలపై జి.ఎస్.టి.వసూలుచేయడాన్ని నటుడు కమల్ హాసన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ సినిమాలపై జి.ఎస్.టి. తగ్గించకపోతే సినిమాలు చేయడం మానుకొంటానని హెచ్చరించారు. కానీ జి.ఎస్.టి. కౌన్సిల్ పట్టించుకోలేదు.

 Film theatres in Tamil Nadu to begin indefinite strike against GST

సోమవారం నుంచి తమిళనాడులో మొత్తం 950 థియేటర్లు మూతపడనున్నాయి. మల్టీ ప్లెక్స్ థియేటర్లతో సహా తమిళనాడులో అన్ని థియేటర్లను మూసి వేయాలని థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయించింది. ఇప్పటికే చాలా థియేటర్లలో ఆన్ లైన్ బుకింగ్స్ నిలిపివేశారు. తమిళనాడు సినీ నిర్మాతలు, నడిగర్ సంఘం కూడా వారికి మద్దతు తెలుపుతున్నారు.

ఇక ఇదిలాఉంటే.. ఈ సమస్య ఒక్క తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు కనుక త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలలో జి.ఎస్.టి. తగ్గింపు కోరుతూ ఆందోళనలు మొదలైన ఆశ్చర్యం లేదు.

సినీ పరిశ్రమలో ఏ శాఖ సమ్మె చేసినా అందరి కంటే ముందుగా బలైయ్యేది జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బాయ్స్ వంటి చిన్నచిన్న పనివారే. తరువాత నిర్మాతలు కూడా చాలా నష్టపోతారు. ముఖ్యంగా సినిమా నిర్మాణం పూర్తిచేసుకొని విడుదలకు సిద్దమైన సినిమాల నిర్మాతల పరిస్థితి దయనీయంగా మారుతుందనే చెప్పాలి.

 Film theatres in Tamil Nadu to begin indefinite strike against GST

ఇక జీఎస్టీ విధానంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ధియేటర్‌ యజమానులు .. తాము ఎవరికీ వ్యతిరేకంగా పని చేయడం లేదని, తమ ఆవేదనను ఇలా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి చెప్పేందుకు, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని తెలిపేందుకే థియేటర్లను మూసేస్తున్నామని వారు తెలిపారు. జీఎస్టీ భారం తగ్గించేవరకు థియేటర్లు తెరిచేదిలేదని వారు తేల్చిచెప్పారు.

- Advertisement -