మరోసారి మహేష్‌తో శృతి హాస‌న్ రొమాన్స్‌..!

362
Shruti Haasan

హీరోయిన్‌ శృతి హాస‌న్ చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, అటు త‌మిళ సినిమాల‌తో పాటు హిందీలోను బిజీ అయింది శృతి. ప్రస్తుతం శృతి తెలుగులో ర‌వితేజ‌తో క‌లిసి ఓ చిత్రం చేయ‌నుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌ కొట్టేసినట్టు తెలుస్తోంది. శృతి సూపర్‌స్టార్‌ మ‌హేష్ కొత్త చిత్రంలో హీరోయిన్ గా న‌టించ‌నుంద‌ని టాలీవుడ్ వర్గాలు అంటున్నారు.

mahesh new film

ప్ర‌స్తుతం మహేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత మ‌హేష్ వంశీ పైడిప‌ల్లితో క‌లిసి మ‌రో ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇందులో మహేష్‌ను ఒక గ్యాంగ్ స్టార్‌గా కనిపించనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే మహర్షీ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అందాల శ్రుతిహాసన్ తీసుకోవాలనుకుంటున్నాడట దర్శకుడు వంశీ పైడిప‌ల్లి. దీని కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. శృతి ఇంతకుముందు శ్రీమంతుడు చిత్రంలో మహేష్ సరసన నటించింది. ఇప్పుడు రెండోసారి మహేష్‌తో జత కట్టనుంది. అయితే ఈ విషయం అధికారికంగా వెలువడల్సివుంది. మరి వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందో చూడాలి.