భారత్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం

80
elgar

భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించింది దక్షిణాఫ్రికా. 273 ప‌రుగుల ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సఫారీలు కేవలం మూడు వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ వీరోచిత పోరాటం చేశాడు. ఎల్గ‌ర్‌కు బ‌వుమా స‌హ‌క‌రించ‌డంతో భార‌త్‌పై ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది సౌతాఫ్రికా. కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ 93 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర‌ను పోషించాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్ : 202
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 229
భారత్ రెండో ఇన్నింగ్స్‌:266
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌:243