మహేశ్ బాబుకు కరోనా..

30
mahesh

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా,ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడగా తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబుకు కరోనా సోకింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల న్యూ ఇయర్‌ను జరుపుకోవడానికి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్లారు. అక్కడ వారంతా సంతోషంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అయితే తాజాగా ట్రిప్ నుండి వెనక్కి వచ్చిన మహేశ్‌కు కరోనా నిర్దారణ అయినట్టుగా తెలుస్తోంది.

https://twitter.com/urstrulyMahesh/status/1479108451833835523/photo/1