కాషాయనేతల కన్నింగ్ పాలిట్రిక్స్…!

82
raja singh
- Advertisement -

బీజేపీ నేతలు బట్టేబాజ్ రాజకీయం బండి సంజయ్ తొండి దీక్ష సందర్భంగా మరోసారి బట్టబయలైంది. పనిగట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై బూతు పదజాలంతో దుష్ప్రచారం చేయడం లేదా..డైలీ ఏదో ఒక ఇష్యూపై రచ్చ చేసి అగ్గిరాజేసి ఆ మంటలలో చలికాచుకోవడం, లేదా…తమను తామే గాయపర్చుకుని సింపతీ డ్రామాలు ఆడడంలో తెలంగాణ బీజేపీ నేతల తర్వాత ఎవరైనా. గతంలో పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్ చౌక్‌ వద్ద రాణి అవంతిబాయి లోధి విగ్రహాన్ని అనుమతి లేకుండా అర్ధరాత్రి పూట పున:ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులకు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

ఈ క్రమంలో పోలీసులు నను అడ్డుకోవడంతో రాజాసింగ్ పథకం ప్రకారం ఓ రాయితో తన తలను రక్తం వచ్చేలా కొట్టుకున్నాడు. విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులను బెదిరించాడు. ఆ తర్వాత పోలీసుల దాడిలో తన తలపగిలిందంటూ రాజాసింగ్ డ్రామా ఆడాడు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తన మామ ఇంట్లో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయాడు. ఆవెంటనే బండి ప్లాన్ మేరకు కాషాయమూకలను రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేయించి నోట్లకట్టలను లాక్కున్న రఘునందన్‌రావు …పోలీసులే తమ ఇంట్లో డబ్బులు దాచారని ఎదురుదాడి చేసాడు. అంతే కాదు పోలీసులు నా చేయి విరగ్కొట్టారంటూ చేతికి బ్యాండేజీ వేసుకుని ఊరూరా తిరిగి సింపతీ డ్రామా ఆడాడు. రఘునందన్‌రావు డ్రామా వర్కవుట్ అయి కొద్ది తేడాతో ఉప ఎన్నికల్లో గట్టెక్కాడు. ఇప్పుడు ఉద్యోగుల బదిలీ అంశాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష పేరుతో తొండి దీక్ష చేపట్టాడు.

పోలీసులు అడ్డుకోవడంతో బండి కావాలనే తన తలను గోడకు గుద్దుకుని గాయపర్చుకున్నాడు..పైగా పోలీసుల దాడిలో తన తలపగిలినా…తనను దౌర్జన్యంగా లాక్కుపోయారని బండి సంజయ్ ఆరోపించాడు. బండికి గాయాలు కావడంతో కాషాయమూకలు ఉన్మాదుల్లా చెలరేగి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. కాగా రాజాసింగ్ , బండిసంజయ్‌లు స్వయంగా తమను తాము గాయపర్చుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెట్‌జన్లు తమను తామే గాయపర్చుకుని అల్లర్లను ప్రేరేపించే కాషాయ ఉన్మాదులు అంటూ తెలంగాణ బీజేపీ నేతలపై మండిపడుతున్నరు. మొత్తంగా జాగరణ దీక్షలో కావాలని రక్తం వచ్చేలా తన తలను బండకేసుకుని బాదుకున్న బండి సంజయ్ చేష్టలు చూసి ఛీఛీ…ఇదేం ఉన్మాదం..ఇదేం బట్టేబాజ్ రాజకీయం అంటూ తెలంగాణ ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు.

- Advertisement -