మంచి మనసు చాటుకున్న సోనూ…

32
sonu
- Advertisement -

రియల్ హీరో సోనూ మరోసారి తన మంచిమనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఎవరైనా తమకు సాయం కావాలని సోనూను సంప్రదిస్తే చాలు తానున్నానని భరోసానిచ్చే సోనూ…తాజాగా దక్షిణాఫ్రికా నుండి తిరిగివస్తున్న ఓ వృద్ధుడికి సాయం అందించి వార్తల్లో నిలిచారు.

దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చే విమానంలో ఒక వృద్ధుడికి తన బిజినెస్ క్లాస్ సీటు ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వృద్ధుడిని చూసిన సోనూ…తన బిజినెస్ క్లాస్ సీటు ఇచ్చాడు.

సోనూ చేసిన సాయానికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోగా ప్రయాణీకులంతా ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలో రోడీస్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు సోనూ. రోడీస్ షోకి ఈ సంవత్సరం హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు సోనూ.

- Advertisement -